IPL2021 : చెన్నై బిగ్ విన్

రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయాన్ని నమోదు చేసింది. 45 పరుగులతో తేడాతో చిత్తు చేసింది. టాస్‌ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9  వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. డుప్లెసిస్‌ (33; 17 బంతుల్లో 4×4, 2×6), మొయిన్‌ అలీ (26; 20 బంతుల్లో 1×4, 2×6), అంబటి రాయుడు (27; 17 బంతుల్లో 3×6), సురేశ్‌ రైనా(18; 15 బంతుల్లో 1×4, 1×6), ధోనీ(18; 17 బంతుల్లో 2×4), బ్రావో (20నాటౌట్‌; 8 బంతుల్లో 2×4, 1×6) తలో చేయి వేశారు. భారీ స్కోర్ చేశారు. ఇక రాజస్థాన్‌ బౌలర్లలో సకారియా 3, మోరిస్‌ 2, ముస్తాఫిజుర్‌ 1, రాహుల్‌ తెవాతియా 1 వికెట్‌ తీశారు.

ఇక 189 పరుగుల భారీస్కోర్ తో బరిలోకి దిగిన రాజస్థానంలో ఏ స్టేజ్ లోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(49; 35 బంతుల్లో 5×4, 2×6) ఒక్కడే రాణించాడు. చివర్లో జయదేవ్‌ ఉనద్కత్‌(24; 17 బంతుల్లో 2×4, 1×6), రాహుల్‌ తెవాతియా (20; 15 బంతుల్లో 2×6) ధాటిగా ఆడినా లాభం లేకుండా పోయింది. దాంతో ధోనీసేన 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్ లో చెన్నైకి ఇది రెండో విజయం. చెన్నై బౌలర్లలో మొయిన్‌ అలీ మూడు వికెట్లు తీయగా జడేజా, సామ్‌కరన్‌ రెండు.. బ్రావో, శార్దూల్‌ చెరో వికెట్‌ తీశారు.