కేసీఆర్ కోలుకోవాలి.. స్టార్స్ ట్విట్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి యావత్ తెలంగాణ షాక్ కి గురైంది. సీఎం త్వరగా కోలుకోవాలని తెరాస శ్రేణులు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.

టాలీవుడ్ ప్రముఖులు సీఎం గారు త్వరగా కోలుకోవాలని ట్విట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, నాగార్జున.. ఇలా ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు.

‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. కరోనాను నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను” అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసిఆర్ గారు, కరోనా వైరస్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.Wish you a speedy recovery Sir. @TelanganaCMO— Chiranjeevi Konidela (@KChiruTweets) April 19, 2021

‘కేసీఆర్‌ గారు తొందరగా కోలుకోండి సర్‌. మీకోసం ప్రార్థిస్తున్నాను’ అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్ చేశారు.

Praying for your speedy recovery #KCR sir. Get well soon 🙏@TelanganaCMO— Mahesh Babu (@urstrulyMahesh) April 19, 2021

‘కేసీఆర్‌ గారు త్వరగా కోలుకోవాలి’ అని సంగీత దర్శకుడు థమన్ ట్విట్ చేశారు.

Get well soon #KCR gaaru @TelanganaCMO @KTRTRS Wishing U A Speedy Recovery ☀️✊Dear Sir 👏🏾 pic.twitter.com/B6SVeTHXEG— thaman S (@MusicThaman) April 19, 2021


‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరోనాబారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’ అంటూ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ట్విట్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కేసిఆర్ గారు, కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.@TelanganaCMO— BANDLA GANESH. (@ganeshbandla) April 19, 2021