ICSE 10వ తరగతి పరీక్షలు రద్దు

దేశంలో కొవిడ్‌ కేసులు విపరీతంగా ఉంటుండంతో 10వ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లుసీఐఎస్‌సీ ప్రకటించింది. 10, 12వ తరగతి వార్షిక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు గతవారం బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. 12వ తరగతి పరీక్షలను తర్వాత నిర్వహిస్తామని తెలిపిన సీఐఎస్‌సీఈ.. పదో తరగతి పరీక్షలను మాత్రం పూర్తిగా రద్దు చేంది. ఆబ్జెక్టివ్‌ క్రైటీరియాలో మార్కులు కేటాయించి త్వరలోనే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే 12వ తరగతి పరీక్షలపై జూన్‌ మొదటి వారంలో తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు వెల్లడించింది.


ఇక కొవిడ్‌ దృష్ట్యా ఇప్పటికే సీబీఎస్‌ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది.