బ్రేకింగ్ : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి మే 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్ల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5,926 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. నిన్న కరోనాతో 18 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,856కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,209 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 3,16,656కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 42,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో 793 కేసులు నమోదయ్యాయి.