రస్మికకు విజయ్ ప్రపోజల్ (వీడియో)

విజయ్ దేవరకొండ-రష్మిక మందనల మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ‘గీతగోవిందం’ సినిమా కోసం తొలిసారి కలిసి నటించారు. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ కావడంతో.. ఇద్దరికీ మంచి పేరొచ్చింది. తెరపై వీరి జంటని మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులని కోరుకున్నారు. వారి కోరికని ‘డియర్ కామ్రెడ్’తో మరోసారి తీర్చారు. ఈ క్రమంలో వీరిద్దరు బాగా దగ్గరయ్యారు. ప్రేమలో పడిపోయారనే ప్రచారం జరిగింది.

ఆ ప్రచారం నిజమే అన్నట్టుగా.. ఓ సారి విజయ్ దేవరకొండ ఇంట్లో కనిపించింది రస్మిక. ఇక ఇటీవల ముంబైలో విజయ్ దేవరకొండతో కలిసి ఓ పార్టీలో పాల్గొంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. ఐతే ఈ జంట సడెన్ షాక్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. విజయ్ రస్మికకు ప్రపోజ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది రియల్ కాదు. రీల్ లైఫ్ కు సంబంధించినది. విజయ్-రస్మిక కలిసి సంతూర్ సోప్ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించినదే తాజా వైరల్ వీడియో అని తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ కి జంటగా అనన్య పాండే నటిస్తోంది. విజయ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. లైగర్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండనుంది. ఇక రస్మిక విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ లోనూ ఓ సినిమాలో నటిస్తోంది.

Intha bagunnarentoo idharu ❤️✨@TheDeverakonda & @iamRashmika from #Santoor AD Shoot #LIGER#VijayDeverakonda

pic.twitter.com/6Pqh8csPhy— 𝚁✪𝚆𝙳𝚈 (@TheNarendar) April 20, 2021