ఆదిపురుష్ శ్రీరామనవమి కానుక

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామాయణ యుద్ధకాండగా ‘ఆదిపురుష్’ తెరకెక్కుతోంది. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో కృతిసనన్ కనిపించనున్నారు.

శ్రీరామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ నుంచి అప్ డేట్ రానుంది. ఈ మేరకు చిత్రబృందం తెలిపింది. అయితే ఎలాంటి అప్ డేటు ఇస్తారు ? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. బహుశా..  రాముడు దర్శనం ఇప్పిస్తారేమో. అదేనండీ.. రాముడి గెటప్ లో ప్రభాస్ లుక్ ని విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ##Salaar with #Adipurush అనే యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.  ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన ఆదిపురుష్ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఈ ఎఫెక్ట్ తో నాగ్ అశ్విన్, సలార్ సినిమాల షెడ్యూల్స్ మారనున్నాయని తెలుస్తోంది.