టాలీవుడ్ సెల్ఫ్ గైడ్ లైన్స్
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో మరోసారి సినిమా షూటింగ్స్ కు బ్రేక్ పడటం, థియేటర్స్ మూతపడటం లేక మళ్లీ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన రావడం ఖాయం అనుకున్నారంతా. కానీ తెలంగాణ ప్రభుత్వం అంత పెద్ద సాహాసం చేయలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నే సెల్ఫ్ గైడ్ లైన్స్ రూపొందించుకోవడం విశేషం.
అత్యవసరమైతే తప్ప సినిమా చిత్రీకరణ చేయకూడదని టాలీవుడ్ నిర్మాతల మండలి నిర్ణయించుకుంది. అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ 50 మందితోనే సినిమాల చిత్రీకరణ, నిర్మాంణాంతర కార్యక్రమాలను జరుపుకోవాలని నిర్మాతల మండలి సూచించింది. సినీ పరిశ్రమ మనుగడ, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ ప్రకటించారు.