డేంజర్ : గంటకు 10వేల కేసులు.. 60 మరణాలు !
కరోనా సెకండ్ వేవ్ తో దేశం విలవిలాడుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయ్. ఎంతలా అంటే.. ? సగటున గంటకు 10వేలకు పైనే కొత్త కేసులు.. 60 మరణాలు సంభవిస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కాదు. స్వయంగా కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పిన గణాంకాలు.
ఏప్రిల్ 1న దేశవ్యాప్తంగా 72వేలపైన కొత్త కేసులు రాగా.. 459 మరణాలు సంభవించాయి. అంటే ఆ రోజు సగటున గంటకు 3వేల కొత్త కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. ఇక సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 2,59,170 కొత్త కేసులు వెలుగుచూశాయి. 1761 మంది మృతి చెందారు. అంటే సగటున గంటకు 10,798 కేసులు.. 60 మరణాలు అన్నమాట.