TSలో మున్సిపల్ ఎన్నికలని వాయిదా వేయండి !

ఈనెల 30న వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఐతే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో.. ఈ ఎన్నికలని వాయిదా వేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ), తెలంగాణ జనసమితి (తెజస) కోరాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథికి టీపీసీసీ నేతలతో పాటు తెజస అధ్యక్షుడు కోదండరాం వేర్వేరుగా లేఖలు రాశారు.

మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి మే 1వ తేది వరకు నైట్ కర్ఫ్యూని విధించింది. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచార సమయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) కుదించింది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో రాత్రి 8 గంటల్లోపు ప్రచారం ముగించాలని ఎస్‌ఈసీ సూచించింది. అయితే ఎన్నికలని వాయిదా వేయాలన్న పార్టీల విజ్ఝప్తులపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాలి.