TSలో 6,542 కేసులు, 20 మరణాలు !
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 6,542 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 20 మంది కరోనాతో మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,887 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,488కి చేరింది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని విధించిన సంగతి తెలిసిందే. మే 30 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. నైట్ కర్ఫ్యూతో కరోనా కంట్రోల్ ని కంట్రోల్ లోకి తేవాలని.. లాక్ డౌన్ వరకు వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వాక్సిన్ పంపిణీ ప్రక్రియని రాష్ట్రంలో వేగవంతం చేస్తున్నారు.