వకీల్ సాబ్.. లెక్చరర్ గా మారితే.. !

వకీల్ సాబ్ గా ఫుల్ మార్కులు కొట్టేశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బాలీవుడ్ హిట్ పింక్ రిమేక్ ఇది. ఇందులో బిగ్ బీ అమితాబ్ నటించిన పాత్రలో పవన్ కనిపించాడు. తెలుగులో కంటే ముందు తమిళ్ లో ఇది రిమేక్ అయింది. స్టార్ హీరో అజిత్ లాయర్ పాత్రలో నటించారు. అయితే అమితాబ్, అజిత్ ల కంటే పవన్ పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుందనే కామెంట్స్ వినిపించాయి. 

లాయర్ పాత్రలో పవన్ ఒదిగిపోయారు. అసలు లాయర్ డ్రెస్ నే పవన్ కి అద్భుతంగా నప్పింది. ఇక కోర్టు వాదనలలో పవన్ తన మార్క్ చూపించారు. టైమ్ టు టైమ్ పర్ ఫెక్ట్ కౌంటర్లతో అదరగొట్టేశాడు. అందుకే ఓ ఖుషి.. ఓ గబ్బర్ సింగ్.. ఓ వకీల్ సాబ్ అంటూ పవన్ ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని డబుల్ ఖుషి చేసే వార్త ఒకటి బయటికొచ్చింది.

అదేంటంటే.. ? వకీల్ సాబ్ లెక్చరర్ గా మారబోతున్నారు. గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ సినిమా రాబోతుంది. ఇప్పుడీ.. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటికొచ్చింది. ఇందులో పవన్ ద్విపాత్రాభినయం చేయనున్నాడట. తండ్రి-కొడుకు పాత్రని పవనే చేస్తాడట. ఓ పాత్రలో లెక్చరర్, మరో పాత్రలో పోలీస్ గా కనిపించనున్నారట. అయితే రెండు క్యారెక్ట‌ర్లోనూ ఎంట‌ర్టైన్‌మెంట్ పీక్ లెవిల్లో ఉంటుంద‌ని స‌మాచారం.