ఈటెలని బుక్ చేసిన కేటీఆర్

తెలంగాణలో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కొరత ఉందా ? లేదా ?? అంటే.. ఉంది. కానీ విషయంలో ప్రభుత్వ స్పందనే భిన్నంగా ఉంది. నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్రంలో రెమిడెసివిర్ కొరత లేదన్నారు. అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఉన్నాయన్నారు. అయితే పొద్దున ఈటెల చెప్పింది తప్పని సాయంత్రంలోగా తేలిపోయింది.

నిన్న సాయంత్రం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. వారం రోజుల్లో అన్నీ ప్రభుత్వ ఆపత్రుల్లో రెమిడెసివిర్ వయల్స్ ఉంటాయని.. ఎలాంటి కొరత ఉండదు. అది నా హామీ అన్నారు. కేటీఆర్ మాటలతో తెలంగాణలో రెమిడెసివిర్ కొరత ఉందనే విషయం స్పష్టం అయింది.

ఇక ఈరోజు మరోసారి మీడియా ముందుకొచ్చిన ఈటెల కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఆర్డర్‌ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. దీనిపై తాము నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌లాగే రెమిడెసివిర్‌ కూడా తమ అధీనం లోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను తమకే కేటాయించాలని ఈటల కోరారు.