కరోనా కట్టడి.. కేంద్రంపై సుప్రీం సీరియస్ !
దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ఉదృతి నేపథ్యంలో.. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. దేశంలో ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్ పద్ధతి, లాక్డౌన్ ప్రకటించే అధికారం.. ఈ నాలుగు అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే దీన్ని మేం సుమోటోగా స్వీకరిస్తున్నాని తెలిపింది.
కరోనా కట్టడికి జాతీయ ప్రణాళిక అవసరమని అభిప్రాయపడిన సుప్రీం.. దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రేపటిలోగా కరోనా నియంత్రణకు సంసిద్ధ జాతీయ స్థాయి ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతపై ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. కొవిడ్ నియంత్రణపై ప్రస్తుతం ఆరు హైకోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. అయితే దీనివల్ల గందరగోళం ఏర్పడుతున్న నేపథ్యంలో తాము విచారణకు సిద్ధమైనట్లు ధర్మాసనం పేర్కొంది.