విశాఖ ఉక్కు.. మెగా లాజిక్ అదిరింది !
విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆందోళనలు వెలువెత్తాయ్. ఏపీలోని దాదాపు అన్నీ పార్టీలు ఈ చర్యని ఖండించాయి. అయినా కేంద్రం ఏమాత్రం తగ్గలేదు. నష్టాల్లో ఉందని సాకుగా చూపి.. విశాఖ ఉక్కుని ప్రయివేటు పరం చేసేందుకు రెడీ అవుతోంది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దంటూ.. ఓ లాజిక్ తో కొట్టారు. అదేటంటే.. ? దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి చేసిన 150టన్నుల ఆక్సిన్ ని మహారాష్ట్రకు తీసుకెళ్లారు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన చిరంజీవి.. నష్టాల్లో ఉందని ప్రయివేటు పరం చేయాలని చూస్తున్న విశాఖ ఉక్కు.. ఆపద సమయంలో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ ని అందించి.. ప్రజల ప్రాణాలని కాపాడుతోంది. అలాంటి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడం సమంజసమా ? అని ప్రశ్నించారు.
Let us THINK.. #VizagSteelPlant #OxygenForIndia pic.twitter.com/6MjSKp7jVB— Chiranjeevi Konidela (@KChiruTweets) April 22, 2021