బ్రేకింగ్ : రేపు ప్రధాని ఉన్నతస్థాయి మీటింగ్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 3లక్షల కేసులు, 2వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు మరోసారి ఉన్నతస్థాయి మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ కారణంగా రేపటి పశ్చిమ బెంగాల్ పర్యటనని రద్దు చేసుకున్నారు.
మరోసారి దేశంలో లాక్ డౌన్ విధించే పరిస్థితులు రాకూడదు. ఆఖరి అస్త్రంగా మాత్రమే లాక్ డౌన్ విధించాలని ప్రధాని మోడీ అన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. చేయిదాటి పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి సమావేశంలో లాక్ డౌన్ పై సమాలోచనలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈరోజు ప్రధాని నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆక్సిజన్ సప్లై పై చర్చించామని ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో రేపటి సమావేశంలో చర్చ లాక్ డౌన్ పై ఉండనుందని సమాచారమ్.
Tomorrow, will be chairing high-level meetings to review the prevailing COVID-19 situation. Due to that, I would not be going to West Bengal.— Narendra Modi (@narendramodi) April 22, 2021
During today’s high level meet, we reviewed the situation relating to oxygen supply and ways to further boost oxygen availability in the coming days. https://t.co/ohHZEHotUe— Narendra Modi (@narendramodi) April 22, 2021