సీటీమార్.. బన్నీకి థ్యాంక్స్ చెప్పిన సల్మాన్ !

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు బాలీవుడ్ కి వెళ్లడం.. అక్కడ కూడా బాక్సీఫీసుని షేక్ చేయడం చూశాం. సినిమాలే కాదు.. మన హిట్ సాంగ్స్ కి కూడా బాలీవుడ్ వదట్లేదు. సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధే’లో ‘దువ్వాడ జగన్నాథం’లోని ‘సీటీమార్‌’ పాటను రీక్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటను సల్మాన్ ఏరికోరి మరీ.. ఎంచుకున్నారట. 

తాజాగా ఈ వీడియో సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా బన్నీని ప్రశంసిస్తూ సల్మాన్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ”సీటీమార్‌’ సాంగ్‌ మాకు అందించినందుకు థ్యాంక్స్‌ బన్నీ. డీజే సినిమాలోని ఈ పాటలో నీ డ్యాన్స్‌, స్టైల్‌ నాకు ఎంతగానో నచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే నువ్వు సూపర్‌. లవ్‌ యూ బ్రదర్‌’ అని సల్మాన్‌ ట్వీట్‌ చేశారు.

ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ తెరక్కుతోంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో సల్మాన్‌ఖాన్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. దిశాపటానీ కథానాయిక.  మే 13న రాధే ప్రేక్షకుల ముందుకురానుంది. ఒకేసారి అటు థియేటర్స్ లో, ఇటు ఓటీటీలో రిలీజ్ కానుంది.

Thank u Allu arjun for seeti maar absolutely loved the way u have performed in the song, the way u dance, your style, u r simply fantastic.. tk care n b safe. Rgds to ur family .. love u brother @alluarjun#SeetiMaar https://t.co/St8cWOmNKX— Salman Khan (@BeingSalmanKhan) April 26, 2021