మంత్రి పువ్వాడ కాలేజ్ కేంద్రంగా దొంగ ఓట్ల దందా ?
మంత్రి పువ్వాడ అజయ్ కు చెందిన మమతా మెడికల్ కాలేజ్ కేంద్రంగా గతంలో జోరుగా దొంగ ఓట్లు నమోదయ్యాయనే ఆరోపణలొచ్చాయ్. గత అసెంబ్లీ, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కాలేజీ కేంద్రంగానే దొంగ ఓట్ల దందా సాగింది. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఇక్కడ దొంగఓట్లు సృష్టించారనే వార్తలు వినిపించాయి. దీనిపై తీన్మార్ మల్లన్న గట్టిగానే వాయిస్ వినిపించారు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? మంత్రి పువ్వాడ కాలేజీ మరోసారి దొంగ ఓట్లకు కేంద్రంగా మారిందని సమాచారమ్.
ఖమ్మ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో.. పువ్వాడ కాలేజీ కేంద్రంగా దొంగ ఓట్లు నమోదయ్యాయని, ఒక్క పువ్వాడ ఇంటి అడ్రస్ తోనే ఏకంగా 600 ఓట్లున్నట్లు ప్రచారం జరుగుతుంది ఓటర్ లిస్టులో పేర్లున్నప్పటికీ ఆ అడ్రస్‌కు వెళ్తే ఓటర్లే లేరని, ఫోన్ ద్వారా సంప్రదిస్తే వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని ప్రతిపక్ష అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరీ .. ఆరోపణలపై మంత్రి పువ్వాడ స్పందిస్తారా ? అన్నది చూడాలి.