3.23లక్షల కొత్త కేసులు..2,771 మరణాలు
దేశంలో గడిచిన 24 గంటల్లో 3,23,144 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో 2,771 మంది కరోనాతో మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కి చేరింది. మరణాల సంఖ్య రెండు లక్షలకు చేరువవుతోంది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 16.25 శాతానికి పెరిగింది.
మొత్తంగా 28,82,204 మంది కరోనాతో బాధపడుతున్నారు. ఇంత ఉద్ధృతిలోనూ.. రికవరీలు కాస్త ఊరటనిస్తున్నాయి. తాజాగా 2,51,827 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. మొత్తంగా కోటీ 45లక్షల మందికి పైగా వైరస్ నుంచి బయటపడగా..రికవరీ రేటు 82.62 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 10వేలు దాటిందిద్. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 10,122 కేసులు, 52 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. మరణాల సంఖ్య 2094కి చేరింది. ఇక తాజాగా 6,446 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,40,590గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 69,221 క్రియాశీల కేసులు ఉన్నాయి. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,440 కేసులు నమోదయ్యాయి.