ABN రాధాకృష్ణ ఇంట్లో విషాదం
ABN ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఇంట్లో విషాదం నెలకొంది. రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ(63) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.
కనకదుర్గ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కనకదుర్గ మృతిపట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్గా సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు.