ఐపీఎల్ జట్లకు ఆటగాళ్లు కరువు

ఐపీఎల్ 2021 ముందుకు సాగుతున్న కొద్దీ.. ఉత్కంఠగా మారుతోంది. టైట్ మ్యాచ్ లు ప్రేక్షకులని మునివేళ్లపై నిలబెడుతున్నాయ్. అంచనాలని తలక్రిందులు చూస్తే.. ఊహించని విజయాలు నమోదవుతున్నాయి. ఫలితం సూపర్ ఓవర్ వరకు వెళ్తుంది. ఇలాంటి టైమ్ లో ఐపీఎల్ జట్లకు ఆటగాళ్ల కొరత వచ్చిపడింది. ఢిల్లీ జట్టు నుంచి రవిచంద్రన్ అశ్విన్.. బయటికొచ్చేసిన సంగతి తెలిసిందే. కరోనా బారినపడిన తన కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

దాదాపు ఇదే కారణంతో రాజస్థాన్ జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆజట్టులో ఆటగాళ్ల కొరత ఏర్పడింది. దీంతో ఆజట్టు మిగితా ఫ్రాంచైంజీలకు లేఖలు రాసింది. ఆటగాళ్లను అరువు తెచ్చుకోవడం కోసం మిగతా ఫ్రాంఛైజీలకు రాజస్థాన్‌ లేఖలు రాసింది. కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఈ సీజన్‌లో రెండు కంటే తక్కువ మ్యాచ్‌లాడిన ఆటగాణ్ని ఇతర జట్లు అరువు తీసుకోవచ్చు. ఆ ఆటగాడు తన సొంత జట్టుపై మ్యాచ్‌లో ఆడకూడదు.