సీఎం జగన్ బెయిల్ రద్దు విచారణకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్.. మళ్లీ జైలుకి జగన్ ?

ఏపీ సీఎం జగన్ బిగ్ షాక్ తగిలింది. ఆయన పాత కేసు కొత్తగా తెరపైకి వచ్చింది. ఊహించినది జరిగితే.. మరోసారి జగన్ జైలుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. 

సాక్షులను ముఖ్యమంత్రి జగన్ ప్రభావితం చేస్తున్నారని పిటిషన్‌ లో ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి చార్జ్‌ షీట్‌లో జగన్ ఏ-1గా ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు పేర్కొన్నారు. బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు. కోర్టు విధించిన బెయిల్ షరతులు జగన్ ఉల్లంఘించారని.. రద్దు చేయాలని ఆయన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ ని సీబీఐ కోర్టు స్వీకరించింది.