రెండోసారి తండ్రైన ఎన్టీఆర్..!

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ రెండోసారి తండ్రయ్యాడు. ఎన్టీఆర్, ప్రణతీ దంపతులకు మరోసారి పండంటి మగబిడ్డ జన్మించాడు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్.. తారక్‌ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్‌ డ్రాప్‌ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు.