తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన ప్రభుత్వం

తెలంగాణలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు పలుమార్లు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఒత్తిడి తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై నైట్ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కూడా కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో చేపడుతున్న కొవిడ్‌ పరీక్షల వివరాలను, కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలు, ఇతర అంశాలను ప్రభుత్వం ఇందులో పేర్కొంది.

  • ఈ నెల 1 నుంచి 25 వరకు రాష్ట్రంలో మొత్తం 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించాం. వీటిలో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్‌, 19.16లక్షల ర్యాపిడ్‌ పరీక్షలు ఉన్నాయి.
  • కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నాం.
  • ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి
  • రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 3.5 శాతం
  • కరోనాపై నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. * కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో మద్యం దుకాణాలు, పబ్‌లు నిబంధనలు పాటించేలా చర్యలు. మద్యం దుకాణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు.
  • రాష్ట్రానికి 430 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్‌ను చేరవేస్తున్నాం.
  • రెమ్‌డెసివర్‌ పర్యవేక్షణ నోడల్‌ అధికారిగా ప్రీతిమీనాను నియమించాం.