బాలయ్య మరీ.. చీప్ అయిపోయాడే !
ఇండస్ట్రీలో ఒక్క హిట్ కొడితే చాలు.. ఆ హీరో పారితోషికం కోట్లకు పరుగెడుతుంటుంది. ‘జాతిరత్నాలు’తో హిట్ కొట్టిన నవీన్ పొలిశెట్టి తన రెమ్యూనరేషన్ ని ఏకంగా రూ. 5కోట్లకుపైగా పెంచాడని సమాచారమ్. అలాంటిది.. నటసింహం నందమూరి బాలయ్య ఓ సినిమా కోసం ఎంత తీసుకోవాలి ? కనీసం పది, పాతిక తగ్గకూడదు. కానీ అఖండ కోసం బాలయ్య అందుకుంటున్న పారితోషికం కేవలం రూ. 7కోట్లేనట.
బాలయ్య పది కోట్లు డిమాండ్ చేసారని, అయితే బోయపాటి నచ్చచెప్పి ఏడుకోట్లకు ఒప్పించారని తెలుస్తోంది. బోయపాటి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోవడం లేదని, లాభాల్లో వాటా తీసుకునే విధంగా నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డితో ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. అఖండ సినిమాకు 70 కోట్లు బడ్జెట్ అవుతుందని మొదటి నుంచీ వినిపిస్తూ వచ్చింది. అందుకే రెమ్యూనిరేషన్ల దగ్గరే కంట్రోలు చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిసింది. అందుకే బాలయ్య పెద్ద మనసు చేసుకొని.. రెమ్యూనరేషన్ విషయంలో అడ్జెస్ట్ అయినట్టు సమచారమ్.