మీ ప్లాస్మాని డొనేట్ చేయండి.. మెగా పిలుపు !
కరోనా సెకండ్ వేవ్ లో బాధితుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ప్లాస్మాదానం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో ఓ సందేశం పోస్ట్ చేశారు. ఆల్రెడి కరోనా బారినపడి.. కోలుకున్నవారు ముందుకొచ్చి ప్లాస్మాదానం చేయాలని కోరారు. దాని వలన కరోనా బారినపడిన వాళ్లలో కొంతమంది చాలా త్వరగా కోలుకుంటారని తెలిపారు. కరోనా ప్లాస్మా డొనేషన్ వివరాలకు, సరైన సూచనల కోసం చిరంజీవి చారిటబుల్ ఫౌండేషన్ ని సంప్రదించాలని.. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు.
గత యేడాది కరోనా తొలిసారి వెలుగులోకి వచ్చిన సమయంలో మెగాస్టార్ టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా పని చేశారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వీడియో, ఆడియో సందేశాలు ఇచ్చారు. అంతేకాదు.. సిసిసి అనే సంస్థని స్థాపించి సినీ కార్మికులని ఆదుకున్నారు. వారికి ఒకటికి రెండు సార్లు ఉచితంగా నిత్యవసర సరుకులని అందజేశారు. ఇప్పటికీ.. ప్లాస్మాదానం పట్ల అవగాహన కల్పించి పెద్ద మనసు చాటుకుంటున్నారు చిరు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు, కాజల్ కథానాయిక. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆచార్య తర్వాత కూడా మెగాస్టార్ రెండు, మూడు సినిమాలని లైన్ పెట్టేశారు.
As we know, Second wave of Covid is impacting even more people.If you have recovered from Covid in last few days,please donate your plasma so it can help 4 more people to combat Covid effectively.Please contact #ChiranjeeviCharitableFoundation (94400 55777)for details & guidance. pic.twitter.com/LXt2fFJYFs— Chiranjeevi Konidela (@KChiruTweets) May 3, 2021