అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయా ?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. జనాలు ప్రాణాలని అర చేతిలో పెట్టుకొనిబతికేస్తున్నారు. ఇలాంటి టైమ్ లోనూ వెండి, బంగారం ధరలు పెరగుతుండటం విశేషం. బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.439 పెరిగి రూ.46,680గా నమోదైంది.

అలాగే వెండి కూడా కిలో రూ.1,302 పెరిగి 69,511కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలకు మద్దతు లభించడంతో దేశీయంగా ధరలు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ తెలిపింది. డాలర్‌ బలహీనపడంతో మదుపరులు సైతం బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపడం పసిడి ధరల పెరుగుదలకు కారణమైంది.