ప్రధానికి రెండో ఆక్సిజన్ లేఖ

దేశంలో ఆక్సిజన్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలన్ని విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని వేడుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి  లేఖల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత అంశంపై వరుసగా రెండో రోజు కూడా ఆమె మోదీకి లేఖ రాశారు.

‘రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 470 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అవసరమైంది. మరో ఏడెనిమిది రోజుల్లో ఇది 550మెట్రిక్‌ టన్నులకు చేరుకునే అవకాశముంది’ అని మమత తన లేఖలో పేర్కొన్నారు. కేవలం పశ్చిమ్‌బంగాల్‌లోనే కాదు.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కొన్ని రాష్ట్రాలకు దీనిపై కోర్టులకు కూడా వెళ్తున్నాయి. దిల్లీకి ప్రతిరోజూ 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలన్న సుప్రీం కోర్టు.. కర్ణాటకకు కూడా ప్రాణవాయువు సరఫరాను పెంచాలని ఆదేశించిన విషయం తెలిసందే.