హెచ్చరిక : థర్డ్‌ వేవ్‌ ముప్పు కూడా..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. సరైన వైద్యం లేక, ఆక్సిజన్ దొరక్క.. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి టైమ్ లోనే థర్డ్ వేవ్ ముప్పు కూడా పొంచి ఉందనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం ప్రజలని మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక ముఖ్య సలహాదారు విజయరాఘవన్‌ థర్డ్ వేవ్ ముప్పుపై స్పందించారు.

దేశంలో థర్డ్‌ వేవ్‌ అనివార్యమని, దానిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని గత బుధవారం చెప్పిన ఆయన అదే అంశంపై మరింత వివరణ ఇచ్చారు. థర్డ్‌ వేవ్‌ దేశంలో వస్తుందనీ, అయితే అన్ని ప్రాంతాల్లో దాని ప్రభావం కనిపించకపోవచ్చని ఆయన అన్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడున్నంత తీవ్రత ఉండకపోవచ్చన్నారు. మూడో దశ వ్యాప్తి అన్ని చోట్లా ఉండకపోవచ్చని, అలాగని నిర్లక్ష్యం చేయకూడదని విజయరాఘవన్‌ హెచ్చరించారు.