కేంద్రంపై ఆక్సిజన్ యుద్ధం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ కోసం కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్లు ఆక్సిజన్ కోసం కేంద్రానికి విజ్ఝప్తులు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు.. కోర్టుకెక్కుతున్నాయి. కేంద్రం ఆక్సిజన్ అందించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. న్యాయస్థానాలు రాష్ట్రాల ఆక్సిజన్ డిమాండ్ ని సమర్థిస్తున్నాయి. రాజధాని దిల్లీకి ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని సుప్రీం ఆదేశించింది.
కర్ణాటక విషయంలోనూ అదే జరిగింది. మరోవైపు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి ఆక్సిజన్ కోసం కేంద్రానికి ఇప్పటికే రెండు సార్లు లేఖలు రాసింది. తమ రాష్ట్రానికి ఆక్సిజన్ అందించాల్సిందేనని లేఖల ద్వారా ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నిలదీస్తున్నారు. ఢిల్లీ, కర్నాటక, పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు.. మిగితా రాష్ట్రాలు ఆక్సిజన్ విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించేలా ఉన్నాయి. అదే జరిగితే.. ఆక్సిజన్ యుద్ధంలో కేంద్రం కూసాలు కదలడం ఖాయం.