రిషబ్ పంత్ గొప్ప మనసు
కరోనా సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేసులు, మరణాలు అధికమవుతున్నాయి. ప్రజలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు లేక నిత్యం ఎంతో మంది కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువ క్రికెటర్ రిషభ్ పంత్ చలించిపోయారు. హేమ్‌కుంత్ ఫౌండేషన్‌కు విరాళం అందజేస్తున్నానని పంత్ ఓ భావోద్వేగపూరిత ట్వీట్ చేశాడు.
‘నేను హేమ్‌కుంత్ ఫౌండేషన్‌కు విరాళం అందజేస్తున్నా. అది ఆక్సిజన్ సిలిండర్లు, పడకలు, కొవిడ్ రిలీఫ్ కిట్లు అందజేయడానికి ఉపయోగపడతాయి. ప్రధాన నగరాలతో పోలిస్తే మౌలిక వసతుల సామర్థ్యం లేని గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలకు వైద్య సహాయం అందించే సంస్థలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నా. ఈ సందర్భంగా మీరు కూడా తగినంత విరాళాలు అందజేయాలని కోరుతున్నా. దాంతో మనమంతా మారుమూల ప్రాంతాలకు వైద్య సదుపాయం కల్పించవచ్చు. అలాగే కరోనాపై.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ అవగాహన, వాక్సినేషన్ కార్యక్రమాలను కూడా వారికి తెలియజేయవచ్చు’ అని పంత్ వివరించాడు.
🙏 pic.twitter.com/x1mm9cunah— Rishabh Pant (@RishabhPant17) May 8, 2021