బిజినెస్ మేన్ తో అనుష్కకు లింకు

హీరోయిన్స్’కు లింకులు పెడితూ గాసిప్స్ పుట్టుకురావడం సాధారణమే. టాలీవుడ్ హీరోయిన్స్ లలో స్వీటీ అనుష్కపై వచ్చిన గాసిప్స్ మరో హీరోయిన్ పై రాలేదు. ఇప్పటికే ‘నాకు డజన్ కు పైగా పెళ్లిళ్లు చేశారు. ఇంకా ఎన్నిసార్లు చేసుకోవాలో’ అంటూ ఓ సందర్భంలో స్వీటీ నవ్వేసింది. బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్-అనుష్కలకు లింకు పెడుతో బోలేడు వార్తలొచ్చాయ్. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది.

ఇప్పుడు ప్రభాస్-స్వీటీ మేటరు కాస్త చల్లబడింది. అదే సమయంలో స్వీటీ పెళ్లి చేసుకోబోతుంది. ఆమె కుటుంగ సభ్యులు వరుడిని వెతికే పనిలో ఉన్నారు. అనుష్కకు వరుడు దాదాపు దొరికినట్టేనని చెప్పుకొంటున్నారు. ఈ యేడాదియే స్వీటీ పెళ్లి ఉందని వార్తలొస్తున్నాయ్. అక్కడితో ఆగకుండా బిజినెస్ తో స్వీటీకి లింకు పెడుతూ గాసిప్ లు పుట్టుకొస్తున్నాయి. అనుష్కని చేసుకోబోయేది ఓ బిజినెస్ మేన్. ఆయనకు దుబాయ్ లో వ్యాపారాలున్నాయని చెబుతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి ప్రకటన రాబోతుందని చెప్పుకొంటున్నారు. ఇందులో నిజమెంత ? అనేది కాలమే చెప్పాలి.

ప్రస్తుతం స్వీటీ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఇదీగాక, తెలుగులో ‘సైలెన్స్’ సినిమాని అంగీకరించింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. [two_third] [/two_third]