లిక్కర్ హోం డెలివరీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోన్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి ఆంక్షలను విధిస్తున్నాయి. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ కూడా లాక్‌డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలను మాత్రం నేరుగా ఇంటికే (హోం డెలివరీ) చేరవేస్తామని ఛత్తీస్‌గఢ్ ప్రకటించింది. లిక్కర్‌ను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే వారికి నేరుగా హోం డెలివరీ చేయవచ్చని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌కు అనుమతి ఇచ్చింది. ఉదయం 9 నుంచి రాత్రి 8గంటల వరకు హోం డెలివరీ చేసుకోవచ్చని పేర్కొంది. ఒక్కో కస్టమర్‌కు గరిష్ఠంగా ఐదు లీటర్ల మద్యాన్ని సరఫరా చేస్తారు.