కేసీఆర్ బద్ద శత్రువుతో కలిసిపోయిన ఈటెల
‘ఈటెల వర్సెస్ కేసీఆర్’ తెలంగాణలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఈటెలపై కేసీఆర్ ఎటాక్ చేశారు. భూ ఆక్రమణలు నేపథ్యంలో ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఇవాళో.. రేపో పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే ప్రణాఌకలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు ఈటెల కౌంటర్ ఎలా ఉండబోతుంది ? కేసీఆర్ గుట్టు-రట్టు తెలిసిన ఈటెల ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ? కొత్త పార్టీ పెడతారా ?? కేసీఆర్, ఆయన కుటుంబం గురించి ఏమైనా సంచలన విషయాలు బయటపెడతారా ?? అని తెలంగాణ సమాజం ఆసక్తి, ఆతృతతో ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈటెల మాత్రం చాలా బ్యాలెన్స్ గా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో వ్యూహాత్కంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.
ఆదివారం సీఎం కేసీఆర్ బద్ద శత్రువుతో ఈటెల కలిసిపోయారు. కేసీఆర్ పై డేరింగ్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న ఫైట్ గురించి తెలిసిందే. బహుశా.. ప్రతిపక్షంని మించి కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్నారు మల్లన్న. పొద్దున లేస్తే.. బాతాల పోశెట్టి అంటూ సీఎం కేసీఆర్ ఇజ్జత్ తీస్తుండు. టీఆర్ఎస్ మానస పత్రిక నమస్తే తెలంగాణని గడీల దొరసాని అంటూ.. మంత్రి కేటీఆర్ ని డ్రామా రావు అంటూ… ఏకీపారేస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలంగాణలో మల్లన్న కేసీఆర్ కు మొదటి శత్రువు, పెద్ద శత్రువు. అలాంటి తీన్మార్ మలన్న క్యూ న్యూస్ కు ఆదివారం ఈటెల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా సంచలన విషయాలు బయటపెట్టలేదు. కానీ సీఎం కేసీఆర్ ఆలోచన విధానం ఎంత భయంకరంగా ఉంటందో వివరించారు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలపై సుతిమెత్తని విమర్శలు చేశారు. అదంతా రావుల కంపెనీ. అక్కడ ఇతరులకు చోటు లేదన్నారు. కరోనా కేసుల లెక్కలు, ధరణి పోర్టల్, ప్రభుత్వ పథకాలపై తన అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. ధరణితో ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఇక కరోనా పరిస్థితులు అదుపులోనికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. మొత్తానికి.. కేసీఆర్ శత్రువులు, వ్యతిరేకులతో ఈటెల టచ్ లోకి వెళ్తున్నారు. వారితో కలిసి భవిష్యత్ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ని ఢీకొనడానికి రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది.