రెండు పార్ట్స్’గా పుష్ప.. కారణమిదేనట !
బన్నీ-సుకుమార్’ల హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ‘ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్’ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసింది. తగ్గేదేలే.. అంటూ బన్నీ గర్జించారు. ఆ ఊరమాస్ గాడ్రింపు రికార్డులు సృష్టించడం ఖాయమని తేలిపోయింది. దీంతో పుష్ప కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి.. సినిమా షూటింగ్ లకు మరోసారి బ్రేక్ పడింది. పుష్ప షూటింగ్ కూడా ఆగిపోయింది.
ఈ గ్యాప్ లో దర్శకుడు సుకుమార్ ఓ అద్భుతమైన ఆలోచన చేశారు. పుష్ప సినిమాని రెండు పార్టులుగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 13న పుష్ప పార్ట్ వన్ ని రిలీజ్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పుష్ప రెండు పార్టుల ఆలోచనల వెనక కారణమేంటీ అంటే.. ? బన్నీనే అంటున్నారు. పుష్ప.. ఈ ఏడాది డిసెంబర్ కు కానీ రెడీ కాదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఎప్పుడు షూట్ లు ప్రారంభం అవుతాయో? డేట్ లు ఎలా మారుతాయో తెలియదు. అంటే బన్నీ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోతుంది. అందుకే వీలయినంత త్వరగా ఓ సినిమా విడుదల చేస్తే బెటర్ అన్న ఆలోచనతో ఈ రెండు భాగాల ఐడియాకు తెరతీశారని సమాచారమ్.