TSలో 4,826 కేసులు, 32 మంది మృతి !

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపం చూపిస్తోంది. కానీ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం వాస్తవాలు కనబడవు. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల్లో తేడా కనిపించింది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 4,826 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మరో 32 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఐతే వాస్తవానికి.. ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని సమాచారమ్.

ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,36,619కి చేరింది.మొత్తం మరణాల సంఖ్య 2,771కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 62,797 క్రియాశీల కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 723 కేసులు నమోదయ్యాయి. మరోవైపు రేపు తెలంగాణ కేబినేట్ సమావేశం కానుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.