హిట్లూ, ఫ్లాపులూ.. రెండూ ఒక్కటే !
విక్టరీ వెంకటేష్ – వెరీ వెరీ స్పెషల్. ఆయనకి విజయం, పరాజయం ఒక్కటే. ఏది వచ్చిన మురిసిపోరు. కుంగుపోరు. ఇగోలేని కథనాయకుడు. ఇండస్ట్రీలో ఏ నటుడితోనైనా కలిసి నటించేందుకు రెడీ. టాలీవుడ్ లో వెంకీ చేసిన మల్టీస్టారర్ సినిమాలు మరో హీరో చేయలేదు.
ఓ ఇంటర్వ్యూలో వెంకీ మాట్లాడుతూ.. ‘జీవితంలో, సినిమాలో మూడు దశలుంటాయి. 1. పనిచేయడం, 2.ఫలితం గురించి ఆలోచించకుండా ఉండటం, 3. ఆ తర్వాత ఫలితం ఎలాంటిదైనా స్వీకరించడం. మంచో చెడో.. ఏదైనా కావొచ్చు. మనల్ని మనం స్వీకరించాలి అన్నారు.
‘ఓ సినిమా ఫ్లాప్ అయితే.. మన పని అయిపోయింది అనే భయం మొదలవుతుంది. హిట్ అందుకుంటే మనమే గొప్ప అనే అతివిశ్వాసం పెరుగుతుంది. ఇవి రెండూ మంచివి కావు. అందుకే ఓ సినిమా చివరి దశలో ఉన్పప్పుడే నేను మానసికంగా బయటకు వచ్చేస్తా. తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తా. అందుకే హిట్లూ, ఫ్లాపులూ నన్ను ఎప్పుడూ మార్చలేకపోయాయి’ అని తెలిపారు.
ప్రస్తుతం వెంకీ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. నారప్ప, ‘దృశ్యం 2, ఎఫ్ 3 రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ మూడింటిలో ఇప్పటికే నారప్ప, దృశ్యం షూటింగ్స్ దాదాపు పూర్తయింది. ఎఫ్ 3 షూటింగ్ మాత్రమే మిగిలిసింది. దీంతో.. వెంకీ నుంచి బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. ప్రేక్షకులని అలరించబోతున్నాయి.