5జీ వల్లే కరోనా వ్యాపిస్తుందా.. ? డాట్ వివరణ !
కరోనా వ్యాప్తికి టెక్నాలజీనే కారణం. 5జీ వలనే కరోనా వ్యాపిస్తోందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై టెలికాం విభాగం(డాట్) స్పందించింది.
“5జీ నెట్వర్క్ పరీక్షల వల్లే కరోనా వ్యాపిస్తోందన్న వదంతులు పుట్టుకొస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం. అసలు పరీక్షలే జరగడం లేదు. అయినా 5జీ సాంకేతికతకు, కరోనాకు సంబంధమే లేదు. అవన్నీ తప్పుడు, అశాస్త్రీయ ప్రచారాలు. మొబైల్ టవర్ల నుంచి నాన్-అయానైజింగ్ రేడియో తరంగాలు, అది కూడా చాలా తక్కువ శక్తితో వెలువడతాయి. అవి జీవించి ఉన్న ఎటువంటి కణాలపై లేదా మానవులపై ఎటువంటి ప్రభావాన్నీ చూపలేవు” అని డాట్ వివరణ ఇచ్చింది.