భారత్ కొవిడ్ స్ట్రెయిన్ (బి-1617) వెరీ డేంజర్
భారత్లో వెలుగుచూసిన కొవిడ్ స్ట్రెయిన్ (బి-1617)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ స్ట్రెయిన్ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఇది ప్రపంచానికి ఆందోళనకరమని గుర్తించాం. ప్రస్తుతానికి మాకు ప్రాథమిక సమాచారమే లభ్యమైంది. ఈ స్ట్రెయిన్ జన్యుక్రమాన్ని, మరిన్ని లోతైన వివరాలను తెలుసుకోవాల్సి ఉందని డబ్ల్యూహెచ్వో కొవిడ్ విభాగ సాంకేతిక నిపుణురాలు డా.మరియా వాన్ కెర్ఖోవ్ అన్నారు.
భవిష్యత్తులో మరిన్ని రకాల కరోనా వైరస్లను, ఆందోళనకర స్ట్రెయిన్లను చూడాల్సి వస్తుంది. వాటి వ్యాప్తిని అరికట్టడం, వ్యాధి తీవ్రతను తగ్గించడం, మరణాలకు అడ్డుకట్ట వేయడం మనముందున్న కర్తవ్యం. మనం ఎక్కడున్నా… జాగ్రత్త పడాల్సింది ఒక్కటే. ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడం-అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవడం. ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా పాటించాల్సిన నియమం. మాస్కు ధరించాలి. ఇతరులకూ, గుంపులకూ దూరంగా ఉండాలిని మరియా చెప్పారు.