తెలంగాణలో లాక్ డౌన్ గైడ్ లైన్స్ ఏంటీ ?

ఎట్టకేలకు లాక్ డౌన్ విధిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుంది. ఐతే లాక్ డౌన్ గైడ్ లైన్స్ ని ప్రభుత్వం ఇంకా విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం కేబినేట్ భేటీ ఇంకా కొనసాగుతోంది. అది ముగిసిన తర్వాత  లాక్ డౌన్ గైడ్ లైన్స్ ని విడుదల చేయనున్నారు.

ఉదయం 6 గంటల నుంచి 10 వరకు అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10గంటల తర్వాత మాత్రం  లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేయనున్నారు. ఐతే లాక్ డౌన్ టైమ్ లో ఎలాంటి కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూ ని కఠినంగా అమలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  లాక్ డౌన్ గైడ్ లైన్స్ కఠినంగా ఉండబోతున్నట్టు సమాచారమ్.

మరోవైపు  లాక్ డౌన్ టైమ్ లో పేదలని ఎలా ఆడుకుంటారు ? గతంలో మాదిరిగా తెల్లరేషన్ కార్డ్ దారులకి ఉచిత బియ్యం పంపిణీ, నగదు అందిస్తారా ? రోజువారీ కూలీల, వలస కూలీల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది ? అన్నది ఆసక్తిగా మారింది. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు, కరోనా వాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది ? అన్నది చూడాలి.