లాక్ డౌన్.. ఓ సడెన్ షాక్ !
తెలంగాణ ప్రభుత్వం సడెన్ షాక్ ఇచ్చింది. పది రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. రేపటి నుంచి 10రోజుల వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. వాస్తవానికి నిన్నటి వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించమని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ఉండదని స్వయంగా సీఎం కేసీఆర్ తెలిపారు
అలాంటిది సడెన్ గా లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే సడెన్ గా రేపట్నుంచే లాక్ డౌన్ అని ప్రకటించడంతో గాబర మొదలైంది. ప్రస్తుతం ప్రయాణంలో ఉన్న ప్రజలు ఇళ్లని చేరుకోవడానికి కూడా సరైన టైమ్ లేదు.
48 గంటల సమయం ఇచ్చిన తర్వాత లాక్ డౌన్ విధిస్తే బాగుండు అనే అభిప్రాయం వెలువడుతోంది. అంతేకాదు.. లాక్ డౌన్ ప్రకటన కంటే ముందే ప్రజలకు ఓ భరోసా ఇస్తే బాగుండు. కూలీలు, వలస కూలీలు, పేదలని లాక్ డౌన్ టైమ్ లో ప్రభుత్వం ఎలా ఆదుకుంటుంది ? అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో పేద ప్రజల్లో ఆందోళన చెందుతున్నారు. దీంతో లాక్ డౌన్ ని ఓ సడెన్ షాక్ లా ఫీలవుతున్నారు.