రేపట్నుంచి లాక్ డౌన్.. వైన్స్ షాప్స్ వద్ద బారులు తీరిన మందు బాబులు !

తెలంగాణలో రేపట్నుంచి లాక్ డౌన్ అమలులోకి రానుంది. రేపట్నుంచి 10రోజుల పాటు లాక్ డౌన్ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో మందు బాబులు అలర్ట్ అయ్యారు. మద్యం షాపుల వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు ప్రభుత్వం లాక్ డౌన్ పై ప్రకటన మాత్రమే చేసింది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇంకా విడుదల చేయలేదు. 

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ లో మద్యం షాపులకు అనుమతి ఉంటుందో.. ? లేదో ? అనే ఆందోళన మందు బాబుల్లో నెలకొంది. దీంతో.. మద్యం షాపుల వద్ద బారులు తీరారు. 10రోజులకు సరిపడా మందు బాటిల్స్ ని కొనుకొనేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా నిబంధనలు పక్కనపెట్టి.. గుమి గూడుతున్నారు. 

గతంలో లాక్ డౌన్ టైమ్ లో మద్యం షాపులకు అనుమతులు ఇవ్వలేదు. ఐతే ఆ తర్వాత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం షాపులకు అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపట్నుంచి అమలు కానున్న లాక్ డౌన్ లో మద్యం షాపులకు అనుమతులు ఉండదేమోనని మందు బాబులు  ముందు జాగ్రత్త పడుతున్నారు. మద్యం షాపుల వద్ద బారులు తీరారు. పనులన్నీ పక్కనపెట్టేసి.. మందు బాటిల్స్ దక్కించుకొనే పనిలో ఉన్నారు.