బి.1.617.. భారత్ రకం స్ట్రెయిన్ కాదు !
బి.1.6.17 స్ట్రెయిన్ ఆందోళనకర రకంగా పేర్కొన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ కొవిడ్ విభాగ సాంకేతిక నిపుణురాలు డా. మరియా వాన్ కేర్‌ఖోవ్ గత సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బి.1.617.. భారత్ రకం స్ట్రెయిన్ అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినట్టు మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. భారత రకం కరోనా వైరస్ ప్రపంచానికి ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం తీవ్రంగా స్పందించింది. డబ్ల్యూహెచ్‌ఓ అలా పేర్కొనలేదని తెలిపింది.
“బి.1.617 వైరస్ స్ట్రెయిన్ ఆందోళనకర రకంగా డబ్ల్యూహెచ్‌ఓ వర్గీకరించినట్లు చాలా మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాల్లో బి.1.617ను ‘భారత వేరియంట్’ అని పేర్కొన్నారు. ఆ వార్తలు నిరాధారం, అవాస్తవం. బి.1.617ను భారత రకం స్ట్రెయిన్ అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పలేదు. కరోనా వైరస్‌ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో 32 పేజీల నివేదిక ఇచ్చింది. అందులో ఎక్కడా ‘భారత్’ అనే పదం లేదు”అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.