లాక్డౌన్.. శృతిహాసన్’కు ఆర్థిక కష్టాలు !
లాక్డౌన్ వలనే సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. స్టార్ హీరోయిన్ శృతిహాసన్ సైతం లాక్డౌన్ వలన తనకు ఆర్థికంగా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని తెలిపారు. ఇటీవల నేను సొంతంగా ఓ ఇంటిని కొనుగోలు చేశాను. దాంతో ప్రతినెలా నేను సంపాదించిన దానిలో కొంత ఈఎంఐ కడుతున్నాను. కానీ ఇప్పుడు అనుకోకుండా లాక్డౌన్ విధించడం వల్ల షూటింగ్స్, నా వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అన్ని పనులు నిలిచిపోయాయి.
ఇప్పుడు ఆదాయం వచ్చే మార్గాలు లేవు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. నాకు వేరే వాళ్లపై ఆధారపడడం ఇష్టం ఉండదు. నేను స్వతంత్ర భావాలున్న మహిళను. దానివల్ల అమ్మానాన్న సైతం నాకు సాయం చేయరు. నాకూ వాళ్ల సాయం పొందడం ఇష్టం లేదు. పరిస్థితులన్ని చక్కబడి మళ్లీ సాధారణ రోజులు రావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ షూటింగ్స్ కనుక ప్రారంభిస్తే వెంటనే నేను సెట్లో వాలిపోతాను. ఎందుకంటే అలా అయినా కొంతవరకూ ఆర్థికంగా నిలదొక్కుకుంటా”నని శృతి తెలిపింది.
ఈ యేడాది శృతిహాసన్ క్రాక్ సినిమాతో హిట్ కొట్టింది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ ‘సలార్’లో నటిస్తున్నారు.