కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలివే.. !

భారత్‌లో దాదాపు 90 శాతం ప్రాంతాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 734 జిల్లాలకుగానూ 640 జిల్లాల్లో పాజిటివిటీ రేటు కేంద్రం నిర్దేశించిన ఐదు శాతం పరిమితి కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తొలిస్థానంలో ఉండగా, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల్లో పాజిటివిటీ అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. పాజిటివిటీ 10 శాతం మించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించాలని కేంద్రం గతంలోనే సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గోవాలో కరోనా పాజిటివిటీ రేటు దాదాపు 48 శాతం ఉండగా హరియాణాలో 37 శాతంగా ఉంది.