హైడ్రోజన్ థెరపీతో కరోనా చికిత్స
కరోనా చికిత్సలో రోజురోజుకూ కొత్త కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయినప్పటికీ రోగుల్లో ఆక్సిజన్ స్థాయి పడిపోడవం వల్ల అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ప్రత్యేక అల్కలైన్ హైడ్రోజన్ వాటర్‌ను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్‌లోని మెడిలైట్ హెల్త్‌కేర్ సంస్థ. హైడ్రోజన్ గ్యాస్‌తో కూడిన ఈ నీళ్లను తాగితే కరోనా రోగుల్లో ఆక్సిజన్ స్థాయి పెరగడమే కాకుండా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. కరోనా చికిత్సలో హైడ్రోజన్ థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే చైనా, జపాన్, అమెరికా దేశాల్లో హైడ్రోజన్ థెరపీని అమలు చేస్తున్నారు. మంచి ఫలితాలని పొందుతున్నారు.