జగన్ ప్రధాని కావాలనుకుంటున్నారు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చాలా మొండి. అనుకున్నది సాధించే వరకు వదలడు. ఆ పట్టుదలతోనే ఏపీ సీఎం అయ్యాడు. ఐతే ఇప్పుడు జగన్ ప్రధాని పదవిని టార్గెట్ గా పెట్టుకున్నారట. ఈ బలమైన కోరికని జగన్ బయటపెట్టలేదు. కానీ ఆయన శత్రువు, వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బయటపెట్టారు. మన గురించి మనకంటే ఎక్కువగా శత్రువులకే తెలుస్తాయ్ అంటే ఇదేనేమో.. !
మీడియా ముందుకొచ్చినప్పుడల్లా.. జగన్ టార్గెట్ చేసే రఘురామకృష్ణంరాజు ఈసారి అదే చేశారు. జగన్కు దేశ ప్రధాని కావాలనే ఆశ ఉందని బాంబు పేల్చారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోకుండా.. కూడబెట్టిన డబ్బులతో ప్రధాని కావాలనుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఐతే ఆయన కోరికని పైనున్న దేవుళ్లు, ఆయన నమ్మిన ఏసుక్రీస్తు కూడా అంగీకరించరని కామెంట్ చేశారు.
జగన్ పై రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆరోపణలు చేయడం, సటైర్స్ వేయడంచూశాం. కానీ మొదటి సారి జగన్ ప్రధాని కావాలనుకుంటున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుశా.. భాజాపా-వైకాపా బంధంపై బలంగా కొట్టడానికి… ఈ వ్యూహాత్మక కామెంట్స్ చేసి ఉంటారేమో.. ! అన్నట్టు… జగన్ బెయిల్ ని రద్దు చేయాలంటూ రఘురామకృష్ణంరాజు కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ వాయిదా పడింది. మరీ.. రఘురామ వాదనతో కోర్టు ఏకీభవిస్తుందా ? జగన్ బెయిల్ ని రద్దు చేస్తుందా ?? అన్నది చూడాలి.