రెండో సరైనోడు రాబోతున్నాడా ?

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. బన్నీ-సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పుష్పని రెండు భాగాలుగా తీసుకురానున్నారు. పార్ట్ వన్ ని మించేలా పార్ట్ 2ని తీసుకురాబోతున్నారట. ఇక పుష్ప తర్వాత బన్నీ ఐకాన్ చేయాలి. ప్రశాంత్ నీల్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ రెండింటిలో ఏ సినిమా ముందు అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇంతలో మరో సినిమా తెరపైకి వచ్చింది. అదే సరైనోడు 2.

బన్నీ-బోయపాటి కాంబోలో వచ్చిన సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. టాక్ తో సంబంధం లేకుండా హిట్టైన సినిమా ఇది. మొదట్లో సరైనోడుపై మిక్సిడ్ టాక్ వినిపించినా.. క్రమంగా పుంజుకొని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రికార్డులు సృష్టించింది. భారీ లాభాలని తీసుకొచ్చింది. ఇప్పుడు సరైనోడు సీక్వెల్ రాబోతుందని సమాచారమ్. ప్రస్తుతం బోయపాటి బాలయ్యతో అఖండ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన బన్నీతోనే సినిమా చేయబోతున్నారని సమాచారమ్. అది సరైనోడు సీక్వెల్ ని తెలుస్తోంది. అది నిజంగానే సీక్వెల్ నా ? కొత్త కథనా ?? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే.