జాన్వీకి బంపర్ ఆఫర్

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా సెట్స్ మీద ఉండగానే జాన్వీకి బంపర్ ఆఫర్ కొట్టిసేనట్టు బాలీవుడ్ సమాచారమ్. ఇటీవలే జాన్వీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆఫీసులో కనిపించింది. దీంతో జాన్వీ తదుపరి సినిమా భన్సాలీ దర్శకత్వంలో ఉండబోతుందనే ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారాన్ని జాన్వీ కూడా ఖండించలేదు. దీంతో జాన్వీ కోసం భన్సాలీ కథని రెడీ చేశాడని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ జనాలు ఫిక్సయిపోయారు. భన్సాలీ దర్శకత్వంలో సినిమా అంటే మంచి బ్రేక్ పడినట్టే. ప్రేమకథలు తెరకెక్కించడంలో భన్సాలీ స్పెషలిస్టు. ఇప్పుడు జాన్వీ కోసం ఓ అందమైన ప్రేమకథని రెడీ చేసి ఉంటాడని చెప్పుకొంటున్నారు. ఇదే నిజమైతే త్వరలోనే జాన్వీ లవ్ స్టోరీని తెరపై చూడొచ్చు.