OTTలో #RRR రిలీజ్ !

కరోనా సెకండ్ వేవ్ ఉదృతి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి థియేటర్స్ మూతపడ్డాయ్. తిరిగి ఎప్పుడు తెరచుకుంటాయ్ అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఈసారి థియేటర్స్ తెరచుకోవడం ఆలస్యం అవుతుంది. బహుశా… వచ్చే యేడాది వరకు థియేటర్స్ మూతపడే ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్న, మీడియం, భారీ బడ్జెట్ సినిమాలు సైతం ఓటీటీలో రిలీజ్ అవ్వడం ఖాయం. ఈ క్రమంలో #RRR కూడా డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. కరోనా బారినపడిన తారక్ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా #RRR ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీలో విడుదల చేసే ఆలోచన ఏమాత్రం లేదు. బాహుబలి, జురాసిక్‌ పార్క్‌, అవేంజర్స్‌ వంటి సినిమాలను ఓటీటీలో చూస్తారా..? ఇది కూడా అంతే. కొన్ని సినిమాలను థియేర్లలలోనే చూడాలి. ఓటీటీలో విడుదల చేయాలనే ఉద్దేశం లేదు. పెద్ద స్క్రీన్‌పై సమూహంగా చూస్తూ ఆస్వాదించే సినిమా ఇది అన్నారు.