పుష్ప రెండు భాగాలు.. కొన్ని డౌట్స్ !
బన్నీ-సుకుమార్’ల హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ రెండు భాగాలుగా రాబోతుంది. దీనిపై మైత్రీ మూవీస్ క్లారిటీ ఇచ్చేసింది. ఐతే రెండు భాగాల విషయంలో ప్రేక్షకులు కొన్ని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. నటీనటుల పారితోషికాల మాటేమిటి ? వారి డబుల్ రెమ్యూనరేషన్ ఉంటుందా ?? సినిమా బడ్జెట్ పెరిగిపోనుందా ?? ఇలా కొన్ని డౌట్స్ ని తెరపైకి తెస్తున్నారు.
వాస్తవానికి పుష్ప స్క్రిప్టు దశలో పుష్షని రెండు భాగాలుగా చేసే ఆలోచన లేదు. తీస్తున్న లెంగ్త్ ని చూసుకుంటే.. చివరికి 4 గంటల వరకూ ఫుటేజీ వస్తుందన్న నిర్దారణకు వచ్చాడు సుకుమార్. నాలుగు గంటల సినిమాని రెండున్నర గంటలకు కుదించడం కంటే, రెండు భాగాలుగా విభజించి అమ్ముకుంటే.. కమర్షియల్ గా డబుల్ ప్రాఫిట్ అని గుర్తించారు. రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు. దీని వలన సినిమా బడ్జెట్ పెరిగే ఛాన్స్ లేదు. ఐతే కీలక నటీనటులకు విషయంలో మాత్రం కొద్దిగా పారితోషికాలు పెరగనున్నట్టు సమాచారమ్.
సుకుమార్ తన పారితోషికానికి అదనంగా రూ.5 కోట్లు, అల్లు అర్జున్‌కి 10 కోట్లు దక్కుతున్నాయట. కెమెరామెన్‌కీ, సంగీత దర్శకుడికీ (దేవిశ్రీ)కి సైతం బోనస్ దక్కుతోందని, తమ పారితోషికంలో 25 శాతం అదనంగా లభించనుందని తెలుస్తోంది. ఇక రెండు భాగాలని ఒకేసారి బేరం చేసుకొన్న బయ్యర్లకు మైత్రీ కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించనుందట. మొత్తానికి.. పుష్ప రెండు భాగాల ఆలోచన.. నిర్మాతలకు లాభాలు పెంచేలా ఉంది.